చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల రోజులుగా కనిపించకుండాపోయిన తమ విదేశాంగ శాఖ మంత్రి చిన్‌గాంగ్‌ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఆయన స్థానంలో తిరిగి వాంగ్ యీని నియమించింది. ఈ నిర్ణయానికి అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ వార్తాసంస్థ జిన్హువా పేర్కొంది. తొలగింపునకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా వాంగ్ యీ 2013 నుంచి 2022 వరకు ఆ మంత్రిత్వ శాఖను ఆయనే నిర్వహించారు.