బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా తీరంలో తీవ్ర గాలులు, అలలు ఉధృతి ఎక్కువగా ఉందని, తూఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని భీమిలి మత్స్యశాఖ అధికారి డి. లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29 తేది వరకు ఈ అల్పపీడనం కొనసాగుతోందని, తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.