సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని మంత్రి విడదల రజిని అన్నారు. మంగళవారం నాదెండ్ల మండలంలో నిర్మించిన రెండు గ్రామ సచివాలయలు, రైతు భరోసా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలను అందిస్తున్నామని వివరించారు. రైతు భరోసా కేంద్రాలను రైతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.