మణిపూర్ అత్యాచార, హింసాత్మక సంఘటనలపై గుంటూరు నగరంలోని న్యాయవాదులు మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. గుంటూరు బార్ అసోసియేషన్, ఆలిండియా లాయర్స్ యూనియన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రధానద్వారం నుండి నిరసన కార్యక్రమం ప్రారంభమైంది. పలువురు న్యాయవాదులు ప్రభుత్వవైఖరిని దుయ్యబట్టారు. రాజ్యాంగ, మానవ హక్కులను ఉల్లంఘించిన నిందితులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.