దేశంలో ఐదు కోట్లకు పైగా ఉపాధి కూలీలను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 2022-23 ఆర్థిక ఏడాదిలో వీరిని తొలగించినట్లు తెలిపింది. 2021-22తో పోలిస్తే 2022-23లో తొలగింపులు 247 శాతం పెరిగాయి. నకిలీ, డూప్లికేట్ జాబ్ కార్డులు, పనిచేయడానికి ఇష్టపడని వారు, గ్రామ పంచాయితీల నుంచి శాశ్వతంగా బదిలీ అయిన కుటుంబాలు, వ్యక్తి మరణించడం తదితర కారణాలతో వారిని తొలగించినట్లు తెలిపారు.