రాయలసీమకి అన్యాయం జరిగింది అని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన మాటలకి స్పందిస్తూ.. అభివృద్ధిపై చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి రాయలసీమకు చేసింది ఏమీ లేదని, ఆయన సొంతంగా ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటీ కూడా లేదన్నారు. రాయలసీమనే కాదు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదని, కమీషన్ల కోసం ప్రాజెక్టుల వద్ద భూమి పూజ, శంకుస్థాపనలు చేసి దోచుకున్నారని విమర్శించారు. ఇవాళ చంద్రబాబు లైవ్ షో ద్వారా ప్రభుత్వంపై చేసిన విమర్శలను గడికోట శ్రీకాంత్‌రెడ్డి తిప్పికొట్టారు.