ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాశక్తి కార్యక్రమం ప్రారంభించిన టీడీపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2023, 01:48 PM

ఉదయగిరి టీడీపీ కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే, ఉదయగిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ బొల్లినేని వెంకటరామారావు, మహిళలతో కలిసి మహాశక్తి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొల్లినేని మాట్లాడుతూ.....  చంద్రబాబు నాయుడు మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏడాదికి మూడు సిలిండర్లు, ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ.1500, ఎంతమంది పిల్లలు చదువుతున్నా ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.15వేలు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పథకాలను విస్తృతంగా గ్రామీణ ప్రాంత మహిళలకు చేరవేయడం మహశక్తి కార్యక్రమ ఉద్దేశమన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com