పాత గుంతకల్లు ఆర్డిటి కార్యాలయం ఎదుట నివాసముంటున్న బోయ పుల్లన్న(50), గురువారం ఉదయం ఇంటి ఎదుట ఉన్న చెట్టును కొట్టేందుకు ఎక్కాడు. ఈ క్రమంలో చెట్టులోని కొమ్మ విరిగి హై టెన్షన్ విద్యుత్తు తీగలపై పడింది. దీంతో షాక్ గురైయ్యాడు. అక్కడే ఉన్న అతని కుమారుడు శివ (22)తండ్రిని పట్టుకోవడంతో అతడు విద్యుత్తు షాక్ కు గురై మృతి చెందాడు. దీంతో రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.