జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. సీఎం జగన్ గురువారం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..విద్యావ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు అని తెలిపారు. గతంలో లంచం ఇస్తేనే పథకాలు అమలు చేసేవారన్నారు. విద్యార్థులు అత్యుత్తమస్థాయిలో ఉండాలనేదే మన ప్రభుత్వం ఆకాంక్ష అని పేర్కొన్నారు.