విధి వక్రీకరించి రోడ్డు ప్రమాదం రూపంలో ఏపీకి చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడు లండన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సుధీర్‌కుమార్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న కుమారుడు కిరణ్‌కుమార్ ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
కిరణ్ కుమార్ రెండున్నరేళ్ల కిందట లండన్ వెళ్లి ఎంఎస్ పూర్తిచేశారు. ఉద్యోగం వేటలో కోర్సుల్లో నేర్చుకుంటున్నారు.. రోజూ క్లాసులకు వెళుతున్నారు. జూన్ 26న బైక్‌పై క్లాస్‌కు వెళ్లేందుకు బయల్దేరాడు. అదే సమయంలో పోలీసులు ఓ దొంగను వెంటాడుతున్నారు. ఆ దొంగ వేగంగా వెళ్తూ.. కిరణ్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
కిరణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నెలపాటు వివిధ ప్రయత్నాలు చేసిన కుటుంబసభ్యులు ఎన్ఆర్ఐల సహకారంతో కిరణ్ మృతదేహాన్ని లండన్ నుంచి స్వదేశానికి విమానంలో తరలిస్తున్నారు. కిరణ్ కుమార్ మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసి వస్తాడుకున్న కుమారుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.