మణిపూర్‌లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది కేంద్ర హోంశాఖ. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది. నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీబీఐని కోరింది. అంతేకాకుండా, ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన దర్యాప్తును మణిపూర్ వెలుపల నిర్వహించాలని ఆదేశించారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగుతున్న తరుణంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.