సినిమాల పైరసీని అరికట్టేందుకు మార్పులు చేసే సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం, 2023కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం సినిమాల పైరసీ కాపీలు తీసే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. దీంతో పాటు సినిమాలకు సీబీఎఫ్సీ ఇచ్చే ధ్రువీకరణను ప్రస్తుతం ఉన్న పదేళ్ల కాలానికి బదులుగా శాశ్వతంగా కొనసాగేలా చట్ట సవరణ చేశారు.