ఉడిపిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాల వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే వాదనలను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తోసిపుచ్చారు. ఉడిపిలోని కళాశాలను అధికారులతో కలిసి ఆమె గురువారం సందర్శించారు. కావాలనే దుష్ప్రచారం చేస్తూ నకిలీ వీడియోలు వైరల్ చేస్తున్నారని ఖుష్బూ అన్నారు. ఘటనపై దర్యాప్తునకు సహకరించాలని ఆమె యాజమాన్యానికి సూచించారు.