ప్రజాస్వామ్యంలో నాయకులపై దాడులు తగవని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. వినుకొండ ఘటనపై ఆమె గురువారం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేపై 500 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడికి తెగబడ్డారని, ఇది సరికాదని అన్నారు. జనరంజక పాలన అందిస్తున్న జగనన్న నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.