గురజాల మండలంలోని నవతా ట్రాన్స్‌పోర్టులో గురువారం మాచర్ల సహాయ వ్యవసాయ సంచాలకుడు వి. జగదీశ్వరరెడ్డి, వ్యవసాయాధికారి సంధ్యారాణి తనిఖీలు చేశారు. బిఎఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్ వారి ఎక్స్‌పోనస్ పురుగుల మందు నిల్వలు గుర్తించారు. అవి కర్ణాటకకు చెందిన కాల్గుడి ట్రేడర్స్ గా గుర్తించారు. ఈ ట్రేడ్స్ కు రాష్ట్రంలో పురుగుల మందుల వ్యాపారానికి అనుమతులు లేకపోవడంతో రూ. 7. 60 లక్షల విలువ గల సరకు సీజ్ చేశారు.