ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, వరదలపై తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి విపత్కర సమయాల్లోనే క్షేత్రస్థాయిలో నిలబడాలని అన్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించి.. ముంపునకు గురైన ప్రాంతాలు, పంటపొలాలను సందర్శించాలని కోరారు. బాధితులకు అండగా నిలవాలని సీఎం జగన్ ఎమ్మెల్యేలను, అధికారులను ఆదేశించారు.