మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి అప్పు తిరిగి చెల్లించనందుకు భర్త కళ్ల ముందే అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వడ్డీ వ్యాపారి. ఈ ఘటన ఫిబ్రవరిలో జరగ్గా తాజాగా వెలుగుచూసింది. వడ్డీ వ్యాపారి సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించి అతని భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఈ ఘటనను ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.