భీమా కోరేగావ్ కేసులో నిందితులైన వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కులహింసను ప్రేరేపించారనే అభియోగాలతో వారిని 2018లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైల్లో ఉన్న ఈ హక్కుల కార్యకర్తలకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. వారిపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవే అయినప్పటికీ, బెయిల్ తిరస్కరించడానికి అవి కారణం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.