ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో రవాణాశాఖ డిజిటల్ విధానంలో లైసెన్స్‌లు, ఆర్‌సీలు జారీ చేయనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ విధానానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయంతో ఇక నుంచి కార్డు కోసం రూ.200, పోస్టల్ ఛార్జీలకు రూ.35 వసూలు చేయరు. దరఖాస్తును పరిశీలించి, డ్రైవింగ్ టెస్ట్ అనంతరం డిజిటల్ విధానంలో కార్డును జారీ చేస్తారు. ఇవి ఎం-పరివార్, డిజి లాకర్లో అందుబాటులో ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa