వరదల కారణంగా రాజమండ్రి పరిధిలోని కూనవరం మండలంలో ఇద్దరు మృతి చెందారు. వెంకటాయపాలెం పంచాయతీ దూగుట్ట గ్రామానికి చెందిన మడకం వెంకమ్మ పశువులను మేపడానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు గోదావరి నీటిలో జారిపడి మృతిచెందింది. భీమవరం గ్రామానికి చెందిన తాటి సత్యనారాయణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఆరోగ్యం విషమించడంతో భద్రాచలం వెళ్లేందుకు ప్రయత్నించగా.. దారులన్నీ జలదిగ్బంధం అయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం లేక.. ప్రాణాలొదిలాడు. ఎటపాక మండలం రాయనపేట వద్ద జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తుండడంతో భద్రాచలం వైపువస్తున్న కారు అదుపుతప్పి పొలాల్లోకి కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారిని స్థానికులు రక్షించారు.