బల్లికురవ మండలం కొమ్మినేని వారి పాలెం లో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేదించారు. శనివారం హత్యకు సంబంధించిన వివరాలను సీఐ ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. నగదు పంపిణీ విషయంలో నిందితుడు రామలింగం కోటేశ్వరరావును కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. నిందితుడిని శనివారం అరెస్టు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.