ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట గ్రామంలో శనివారం అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో పులుల సంరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలానే అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరమని అటవీశాఖ అధికారులు ప్రజలకు తెలిపారు. పులుల సంరక్షణ కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు. పులులకు హాని తలపెట్టరాదని పులులు ఉండడంవల్ల అడవి భద్రంగా ఉంటుందని ప్రజలకు అటవీశాఖ అధికారులు తెలిపారు.