ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ కల్లాం హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తాను చెప్పిన స్టేట్‌మెంట్‌కు విరుద్ధంగా సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొందన్నారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సీబీఐ సమర్పించిన వాంగ్మూలం భిన్నంగా ఉందన్నారు. వివక్ష, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వక్రీకరిస్తోందంటే విచారణ ఏ స్థాయిలో పక్కదారి పడుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా ఎవరి ప్రోద్బలంతో జరుగుతోంది?.. సీబీఐ లాంటి సంస్థ ఎందుకు వివేకా హత్య కేసును ఏకపక్షంగా విచారణ చేస్తోంది? అన్నారు.
మార్చి 15, 2019న వైఎస్ జగన్ నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందన్నారు అజయ్ కల్లాం. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారని.. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారన్నారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారన్నారు. ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదన్నారు. తాను స్టేట్‌మెంట్లో తాను ఇదే చెప్పానని.. కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందన్నారు.
జగన్ సతీమణి ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని.. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్‌మెంట్‌లో అబద్ధాలే ఉన్నాయన్నారు. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తుందని.. కొంతమంది వ్యక్తులను ఇరికించే ప్రయత్నాల్లో భాగంగానే సీబీఐ ఇది చేస్తోందన్నారు. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్‌మెంట్‌గా పేర్కొన్న అంశాలను కొట్టిపారేయాలని హైకోర్టుకు విన్నవించారు. ఈ రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న సంగతి తెలిసిందే. 2023 ఏప్రిల్ 9న సీబీఐ తన స్టేటమ్‌మెంట్ రికార్డు చేసిందని అజయ్ అంటున్నారు.
వివేకా హత్య కేసు వ్యవహారంలో సీబీఐ ఎస్పీ తనను కలిసి వివరాలు తీసుకున్నారని అజయ్ కల్లాం గతంలో చెప్పారు. చిట్ చాట్ అని చెప్పి సీబీఐ తన నుంచి కొన్ని వివరాలు తీసుకుందని.. తాను చెప్పిన వివరాలతో సీబీఐ రూపొందించిన 161 స్టేట్ మెంట్‌కు ఎలాంటి విలువ లేదన్నారు.. అది కేవలం సమాచారంగా మాత్రమే సీబీఐ సేకరించిందని చెప్పారు. తాము 2019 మార్చి 15న మేనిఫెస్టో సమావేశంలో ఉండగా వివేకా నోమోర్ అనే విషయం మాత్రమే తనకు తెలిసిందన్నారు. వివేకా ఎలా చనిపోయారన్న వివరాలను తానేమీ సీబీఐకి చెప్పలేదని.. తాను ఆ వివరాలు ఏమీ చెప్పకపోయినా సీబీఐ చేసేది ఏమీ లేదన్నారు. సీబీఐ చార్జ్‌షీటులో తాను చెప్పిన విషయాలను మార్చేసినట్లు అజయ్ కల్లాం ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa