విజయనగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవర్ నిర్వహించారు. ఈ క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వింత అనుభవం ఎదురైంది. పెండింగ్‌లో ఉన్న పాత ఈ చలానాలను కూడా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఒక బైక్‌పై ఏకంగా 93 ఈ చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అన్ని చలానాలు చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఏపీ 31ఈపీ 7099 అనే హీరో గ్లామర్ బైక్ ని ఆపి రికార్డ్స్ తనిఖీ చేశారు. బైక్ సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ , బైక్ ఇన్స్యూరెన్స్ తో పాటు ఇతర డాక్యుమెంట్స్ చెక్ చేశారు. అలాగే బైక్‌పై ఉన్న జరిమానాలు పరిశీలించారు.
ఆ జరిమానాలు చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఆ బైక్‌పై ఏకంగా 93 చలానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అవన్నీ ఆటోమేటిక్ ఈ చలాన్ సిస్టమ్ ద్వారా పడినవే అని తెలిపారు. ఆ వాహనదారుడు వేరే వ్యక్తి నుంచి బైక్ కొనుగోలు చేశాడు. అలా పాత జరిమానాలు పెండింగ్ ఉన్నట్టు తనకు తెలియలేదని చెబుతున్నాడు. కానీ పోలీసులు మాత్రం పెండింగ్ చలనాలు అన్ని కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ బైక్ అమ్మినా చలానాల కట్టేందుకు డబ్బులు రావని ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతేకాదు ఎవరైనా పాత వాహనాలు కొనుగోలు చేసే సమయంలో సీబుక్, లైసెన్స్, పొల్యూషన్‌తో పాటు బైక్‌పై ఉన్న పెండింగ్ చలానాలు కూడా చెక్ చేసుకోవాలి అంటున్నారు. అలా తెలుసుకోకపోతే పెండింగ్‌లో ఉన్న ఈ చలానాలను చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత యజమానిపైనే ఉంటుందన్నారు. విజయనగరంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్ ఈ చలనాలను పరిశీలించి.. పాత చలానాలను కూడా ఇప్పుడు క్లియర్ చేయించారు. ఇలా 163 మంది వాహనదారులు పాత ఈ చలానాలను చెల్లించారని పోలీసులు తెలిపారు.