విపక్షాల కూటమి 'ఇండియా' పై ప్రధాని మోదీ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ యువనేత కన్నయ్య కుమార్ కౌంటర్ ఇచ్చారు. 'ప్రధాని లాజిక్ ప్రకారం గాడిదకు రెండు కళ్లు, ప్రధానికి రెండు కళ్లు ఉంటాయని చెబుతా' అని అన్నారు. కాగా, ఈస్ట్ ఇండియా, ఇండియన్ ముజాహిదీన్ కంపెనీల పేర్లలోనూ 'ఇండియా' ఉందని ప్రధాని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది.