సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగస్టు ఒకటవ తేదీన విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను శనివారం అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున, పోలీస్ కమిషనర్ డాక్టర్ త్రివిక్రమ వర్మ, ఏయూ వీసీ పి. వి. జి. డి. ప్రసాదరెడ్డి, రిజిస్టర్ కృష్ణ మోహన్ ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.