పోలవరం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడైనా నిజాలు మాట్లాడారా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పోలవరంపై ఏనాడైనా ఆలోచించారా? అని నిలదీశారు. పోలవరంపై చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధే లేదన్నారు. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలమయమే. టీడీపీ హయాంలో తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యమైంది. చంద్రబాబు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. చంద్రబాబు హయాంలో అన్నీ కరువుకాటకాలే. చంద్రబాబు శనిపాదం అడుగుపెడివతే వర్షాలే కురవవు. ఎల్లోమీడియాతో పోలవరంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్త పరిచారు.