దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి రేపు విశాఖకు సీఎం వైయస్ జగన్ రానున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 16 ఎకరాల్లో సుమారు 12 ఎకరాల స్థలంలో మాల్ నిర్మించనున్నారని, మిగిలిన స్థలంలో ఐటీ స్పేస్ కూడా డెవలప్ చేసే విధంగా పారిశ్రామిక వేత్తలు ముందుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు, వైజాగ్ టెక్నాలజీ పార్కు, ఒబేరాయ్ హోటల్స్ నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రానున్న కాలంలో విశాఖనగరంలో మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టడం ఖాయమన్నారు.