తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును సినీ హీరో మంచు మనోజ్ దంపతులు కలిశారు. సోమవారం సాయంత్రం హీరో మనోజ్, మౌనిక హైదరాబాద్లోని తెలుగుదేశం అధినేత నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబుతో మనోజ్ దంపతులు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
అయితే తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇస్తూ మాట్లాడిన మంచు మనోజ్.. అసలు చంద్రబాబును ఎందుకు కలిశాను అనే వివరాలను వెల్లడించారు. రేపు తన కొడుకు ధైరవ్ పుట్టినరోజు అని చెప్పిన మంచు మనోజ్..తమ బాబుకి చంద్రబాబు ఆశీస్సులు తీసుకోవడం కోసం స్వయంగా ఆయన వద్దకి తీసుకెళ్లామని చెప్పారు.అయితే తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ... మంచి సందర్భం వచ్చినప్పుడు మౌనిక ఈ విషయాన్ని వెల్లడిస్తానని మంచు మనోజ్ అన్నారు. అదేవిధంగా చంద్రబాబును కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని మౌనిక అన్నారు.