ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ అగ్రనేత నారా లోకేశ్ ప్రమాదం తప్పింది. దర్శి నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో ఒక్కసారిగా జనాలు ఆయనపై పడటంతో లోకేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు.అప్రమత్తమైన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో జరిగిన గొడవలో లోకేష్ 3 సార్లు కింద పడే ప్రమాదం నుంచి బయటపడ్డారు..ఈ తొక్కిసలాటలో లోకేష్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. జనాలను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు విఫలమయ్యారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.