నెల్లూరు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా మూడో రోజు కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఎటుచూసినా కిక్కిరిసిన జనంతో నిండిపోయింది. ఇక స్వర్ణాల చెరువులో భక్తులు తమ కోరికలు కోరుకుంటూ రొట్టెలను పట్టుకున్నారు. గత ఏడాది పెళ్లి రొట్టె పట్టుకున్నాము. పాపకు పెళ్లి అయింది. సంతానం రొట్టె తీసుకెళ్లాము పండంటి పాప పుట్టింది. భక్తులు ఇలా తమ అనుభవాలను పంచుకుంటున్నారు.