ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ అంశంపై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే వారి పిల్లలు ప్రేమ వివాహం చేసుకునేలా నిబంధనలు తేవాలని పాటీదార్ సామాజికవర్గం నుంచి డిమాండ్లు వస్తున్నాయని సీఎం అన్నారు. ఈ అంశానికి రాజ్యాంగం ప్రకారం ఆమోదించవచ్చా? లేదా? అని పరిశీలిస్తున్నామన్నారు.