తమిళనాడు రాజధాని చెన్నైలో రౌడీలు, పోలీసులకు మధ్య పెద్ద వార్ జరిగింది. గుడువాంచేరి సమీపంలో పోలీసులు వాహనాలకు తనిఖీ నిర్వహిస్తుండగా.. ఓ నల్లటి కారు పోలీసు వాహనాన్ని ఢీకొట్టి తప్పించుకుంది. పోలీసులు ఆ కారును వెంబడించగా ఊర్పాకం సమీపంలో కారు ఆపారు. కారులోంచి నలుగురు వ్యక్తులు కొడవళ్లు, ఆయుధాలతో పోలీసులపై దాడికి దిగారు. పోలీసులు కాల్పులు జరపడంతో రౌడీ షీటర్ వినోద్ (35) మృతి చెందాడు. అతడి స్నేహితుడు రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa