వెల్దుర్తి మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెంలో నివసిస్తున్న జక్కుల శ్రీను (42) తనకున్న రెండు ఎకరాలతో పాటు ఇంకో ఐదు ఎకరాలు కౌలుకు సాగు చేసేవాడు. మూడేళ్లుగా పత్తి, మిర్చి సాగుకు అప్పులు చేశాడు. ఇటీవల వర్షాలతో పత్తిపంటలో నష్టం వాటిల్లింది. దీంతో మనస్తాపానికి గురై శనివారం పొలంలో పురుగుల మందు తాగాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.