నరసరావుపేట జిల్లా పోలీసు కార్యాలయంలో జగనన్నకు చెబుదాంకు హాజరయ్యే ప్రజల ఉచిత అన్నదానం కోసం సుమారు రూ. 6లక్షలతో నిర్మించిన షెడ్డును సోమవారం ఎస్పీ వై. రవిశంకర్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేపీ రంగారావు సహకారంతో 250మందికి ఏర్పాటుచేసిన ఉచిత అన్నదానం స్వయంగా వడ్డించారు.