గురజాల నియోజకవర్గం లోని పిడుగురాళ్ల పట్టణానికి చెందిన తెలుగు యువత కార్యకర్త షేక్ ఇంతియాజ్ ను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేస్తున్నట్లు పిడుగురాళ్ల పట్టణ టిడిపి అధ్యక్షుడు పాండురంగ శ్రీనివాసరావు సోమవారం రాత్రి తెలిపారు. నడవడిక సరిగా లేనందున పలుమార్లు హెచ్చరించినా పద్ధతిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇంతియాజ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆయన తెలియజేశారు.