మున్నేరు ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వీ. పీ. గౌతమ్ ఆదేశించారు. మున్నేరు ముంపు ప్రాంతమైన 35వ డివిజన్ లోని మోతీనగర్లో సోమవారం పర్యటించిన కలెక్టర్ సహాయక చర్యలను తనిఖీ చేశారు. ఇంటింటికీ తిరుగుతూ వరదతో జరిగిన నష్టం, జ్వర సర్వేపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో ఇంటింటి సర్వేకు 21 బృందాలు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు 3, 026 ఇళ్లలో సర్వే పూర్తయిందన్నారు.