అనకాపల్లి బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ అంతర్జాతీయ స్నేహమాసోత్సవ వేడుకలలో భాగంగా సోమవారం బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యం లోమహిళలకు సొంతంగా తయారు చేసిన వివిధ రకాలవంటల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని పెంటకోట కళ్యాణ మండపంలో జరిగిన ఈ పోటీలకు డాక్టర్ అలేఖ్య లక్ష్మీ నారాయణరావు దంపతులు జడ్జీలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షులు నరిసింగరావు, క్లబ్ చైర్మన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.