విశాఖ రైతుబజార్లలో రాయితీ టమాటా విక్రయాలకు ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టేసింది. నాలుగు రోజుల నుంచి టమాటా విక్రయాలు నిలిచిపోయాయి. ఎప్పుడు సరకు వస్తుందో తెలియదని ఎస్టేట్ అధికారులు చెబుతున్నారు. రాయితీపై కిలో రూ. 50కే ఇచ్చేవారు. ఇప్పుడు నిలిపివేయడంతో బయట ధర బాగా పెరిగింది. కిలో రూ. 200పైనే అమ్ముతున్నారు. దాంతో చాలా మంది రూ. 50 చెల్లించి పావు కిలో కొంటున్నారు.