పెందుర్తి నియోజకవర్గంలోని సింహాచలం తొలి పావంచా నుంచి అడవివరం వరకు బిఆర్టిఎస్ రోడ్డును 60 మీటర్లకు విస్తరిస్తే తీవ్రంగా నష్టపోతామంటూ 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి. గంగారావు, టిడి. కృష్ణంరాజు, సిపిఎం నాయకులు పనివాడ వెంకటరావు ఆధ్వర్యాన బాధితులు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చు అంటూ ఓ దినపత్రికలో విడుదలచేసిన ప్రకటనను వ్యతిరేకించారు.