దక్షిణ భారత హిందీ ప్రచార సభ (చెన్నై) సెప్టెంబర్ లో నిర్వహించే హిందీ హయ్యర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 5వరకు గడువు పొడిగించినట్లు ఆదర్శ హిందీ ప్రేమి మండలి భీమిలి అధ్యక్షులు కేఎస్ఆర్ కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కారణంగా రూ. 10 అపరాధ రుసుముతో ఈ గడువు పొడిగించినట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.