వాలంటీరుకు బదులు అతడి వేలుముద్రలు ఉపయోగించి సోదరుడు పింఛన్లు ఇస్తున్న ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలంలో జరిగింది. పడమటికట్టకిందపల్లి పరిధిలోని కందులవారిపల్లిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న గురుప్రసాద్ బెంగళూరులో ఉంటున్నాడు. మంగళవారం పింఛను నగదును ఆయన సోదరుడు పంపిణీ చేశారు. గురుప్రసాద్ ప్లాస్టిక్ వేలిముద్ర వేసి కొందరికే పింఛను ఇచ్చాడు. దీంతో మిగతావారు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది.