ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుకు ఒడిశా అధికార పక్షం బిజూ జనతా దళ్(బీజేడీ) మద్దతివ్వనుంది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి సైతం వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేడీ నిర్ణయాన్ని మంగళవారం రాజ్యసభలో ఆ పార్టీ నేత సస్మిత్ పాత్ర ప్రకటించారు. బీజేడీ నిర్ణయం ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రానికి పెద్ద ఊరటనివ్వనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa