విశాఖలో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కోసం వచ్చిన సీఎం జగన్ కి, బాధితుడు మొరపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే... పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన వీరవల్లి మోహన్ (17) నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతింది. ఆరోగ్యశ్రీ దయవల్ల వైద్యం అందినా ఫిజియో థెరపీ కోసం చాలా ఖర్చవుతున్నట్లు బాధితుడు మొర పెట్టుకున్నాడు. దీంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు కలెక్టర్ డా.మల్లికార్జున వైద్య ఖర్చుల కోసం బాధితుడికి రూ.లక్ష చెక్కు అందజేశారు.