రాయలసీమలో చంద్రబాబు పదిరోజులపాటు యుద్ధభేరీ చేస్తానంటూ ప్రకటించాడు. అంతకు ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు దోమలమీద దండయాత్ర అని కూడా అన్నాడు. మరి ఆ దండయాత్ర ఏమయ్యిందో.. దోమలు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు బాబు చెప్పే యుద్ధభేరీ అంటే అర్ధమేంటి..? అని వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర అగ్రిమిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్‌లో కాదు. ఉండేదేమో తెలంగాణలో .. అంటే, తెలంగాణలో నివాసం ఉంటూ విజిటింగ్ వీసా మీద ఆంధ్రకొచ్చి ఇక్కడి ప్రజల మీద యుద్ధభేరీ మోగిస్తున్నాడా.. ఆంధ్రప్రదేశ్ విధ్వంసాన్ని చంద్రబాబు కోరుతున్నాడా..? అని ప్రశ్నించారు.