ఏ అర్హతతో చంద్ర బాబు కడప జిల్లాలో ప్రాజెక్టుల పర్యటనకు వస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ప్రశ్నించారు. కడప నగరంలోని వైయస్ఆర్ జిల్లా కార్యాలయంలో అయన మాట్లాడుతూ..పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దని వ్యతిరేకంగా ప్రకాశం బ్యారేజి దగ్గర ధర్నా చేసిన దేవినేని ఉమ కు మంత్రి ఇచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని నిలదీశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకువచ్చింది ఎన్టీఆర్ .. 1989-1994 మధ్య కొంత వరకు పనులు జరిగాయి. తొమ్మిదేళ్ళ ముఖ్య మంత్రి గా ఉండి తెలుగు గంగను ఎందుకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టు లను పూర్తి చేసి యుద్ద ప్రాతిపదికన సాగు నీరు అందించారని గుర్తు చేశారు.