సీఎం జగన్ మరోమారు పెద్ద మనస్సు చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే... విశాఖలో పర్యటించిన సీఎం జగన్ ద్వారా కాన్సర్ బారినపడి చికిత్స పొందుతున్న ఓ వలంటీర్‌కు ఆర్ధిక సహాయం అందింది. పద్మనాభం మండలం కొవ్వాడ గ్రామ వలంటీర్ అంకాబత్తుల తులసి క్యాన్సర్ బారినపడి చికిత్స పొందుతోంది. ఆమె భర్త ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఏయూలో సీఎం జగన్‌ను తన కుటుంబంతోపాటు కలుసుకుంది. ఆమె అనారోగ్య సమస్య గురించి తెలుసుకున్న సీఎం జగన్ తక్షణ సాయంగా రూ.లక్ష అందించాలని ఆదేశించారు. చికిత్సకు అవసరమైన సహకారం అందించాలని అధికారులని ఆదేశించారు.