సీఎం జగన్ విశాఖ పర్యటన సందర్భంగా , కంచరపాలెం బాపూజీ నగర్‌కు చెందిన సంతోషి తన కుమారుడ్ని తీసుకొని సీఎంని కలిసేందుకు రాగా భద్రతా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అది గమనించిన సీఎం బాధిత కుటుంబాన్ని లోపలికి పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కుమారుడు గవిడి ఢిల్లీశ్వరరావు (9) చిన్నప్పటి నుంచి ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్నాడని, వైద్యం కోసం ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు మహిళ తెలిపింది. వారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్ ఆర్థిక సాయం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి కలెక్టర్ వెంటనే రూ.లక్ష చెక్కును అందజేశారు.