జీఎస్టీ కౌన్సిల్ వర్చువల్ సమావేశం బుధవారం జరగనుంది. కౌన్సిల్ చీఫ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ చేస్తున్న వారికి నేటి సమావేశం ముఖ్యమైంది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనపై బుధవారం మంత్రుల బృందం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.