పెదబయలు మండలంలోని పెదకోడపల్లి పంచాయతీ పరిసర ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీనితో పెదకోడపల్లి పర్ధనిపుట్టుకు మధ్య కాజ్వేపై వాగు పొంగి ప్రవహింస్తుండంతో కాజ్వే దాటి పట్టణ ప్రాంతాలకు రాకపోకలకు ఆయా గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ కాజ్వేపై వంతెన నిర్మాణం చేపట్టి గిరిజనుల రవాణా కష్టాలు తీర్చాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.